
సంవత్సరం అంతా పరుగులీడింది,
అలిసిపొయిన తరుణంలో,
బరువు బాధ్యతలన్ని తీరుచుకున్న తరుణంలో,
వ్రుద్దాప్యంలోకి అదుగులేస్తోంది ప్రకృతి.
కాసింత శాంతి కోసం,
హడావడిని పక్కకుపెట్టి,
స్వాపములోకి జారుమడిగింది.
20 ఏళ్ళ నా జీవితంలో ఎప్పుడు చుడలేదు గనుకనేమో, ప్రతి సంవత్సరం అదొక ఫ్యాంటసీ.
పర్వతాలకు దగ్గరవడానికి అదొకక కారణం. ప్రతి సంవత్సరం కొత్త అతిథి. ఇంకా కొత్తగా ఈసారి.
Glacier National Park, Montana. వేసవిలో దాదాపు 10 లక్షల మంది వెళ్ళే పార్క్.
హేమంతం ఒచ్చేసరికి ఒక్క పురుగు కూడా కనపడదు. ప్రశాంతతకి పెట్టింది పేరు. ఏమి దొరకవు ఆ ప్రదేశంలో. వింటర్ క్లోషర్. మళ్ళా అలా ఎప్పుడు అంటే.. ఎమో.
ఎందుకో రవీంద్రుని పద్యానికి చలంగారు అనువదించిన ఈ మాటలు గుర్తుకొచ్చాయి.
“హే భాస్కరా, ఆకాశం తప్ప నీ మూర్తిని భరించగలిగింది ఎవరు?
నీ మీద కలలు కంటాను. కానీ నీ సేవ చెయ్యగలనానే ఆశ నా కెన్నడు లేదు. నిన్ను నాలోకి తీసుకోడానికి నేను మరీ అల్పురాలిని. ఓ మహత్తరా, నా బతుకంతా కన్నీళ్ళే” అని ఏడ్చింది మంచు బొట్టు.
“అనంత ఆకాశాన్ని వెలిగించి కూడా, చిన్న తుషార బిందువుకైనా నన్ను నేనిచ్చేసుకోగలను. ఒక చిన్న వెలుతురు తనుకునై నిన్ను నింపుతాను. నీ చిన్న జీవితం హాసపూరిత మండలమై వెలుగుతుంది.” అన్నాడు ఆదిత్యుడు.
– చలం, రవీంద్రులు
Leave a Reply