
పదేళ్ళుగా పర్వతాల్లో తిరుగుతున్నా, గొప్ప అనుభావాలు ఎప్పుడు ఆనంద క్షణాల్లోనో, పర్వత శిఖరం మీదో ఉంటాయని అనుకోను. చూసిన పర్వతాలే కొన్నిసార్లు కొత్తగా ఉంటాయి. అయినా ప్రతిసారి, ప్రతి ఋతువులో కొత్తగా ఉంటాయి. కాబట్టే పర్వతాలు అవి.
ఆప్పటికి అది మూడోసారి వాటిని చూడటం. మేరూన్ బెల్ల్స్, అమెరికా మొత్తంలో ఎక్కువ చిత్రించిన పర్వతాలగా చెప్పుకుంటారు. కొలరాడో రాష్త్రం. వాటి అందం, గొప్పతనం….. క్రౌడ్స్ తో స్పాయిల్ అయిన ప్లేస్ అని అనటంలో తప్పేమి లేదు. అన్నీ అలా అందితే లొకువైపోతాయేమో. ఎమైనా, ఆ సాయంకాలం కార్లో ఎల్తున్నప్పుడు , బయట 3 డిగ్రీల వెథర్, రాత్రి 10 గంటలు. అప్పుడు బహుశా వాటిని ఎవరూ చూస్తుండరు, ముందు నిలబడి ఫోటోలు కావలని ఎవరూ అడగరు. బహుశా అవి ఆనందంలో గానం చేస్తున్నాయి ఏమో…ఏమో….
మార్గశిర చంద్రుని నిశ్శబ్ద పౌర్ణమి కాంతిని,
అపహరించి పలాయనమయిన సూర్యుడు,
కిరణ తూలికలతో కొండల్ని మంచుతో అలంకరిస్తున్నాడు.
అనంత నీలపు ఆకాశంతో కలిసి పర్వతాలు గానం చేస్తున్నాయి.
Leave a Reply