The Alchemy of Air

Fritz Haber, Adolf HItler, Carl bosch

“దృక్పథానిది కాదు, దురద్రుష్టానిది దుర్మార్గం.” అంటారు గొల్లపూడి మారుతీరావుగారు “రుణం”లో.

ముక్తవరం పార్థసారథి గారి “నోబెల్ తారలు” చదువుతున్నప్పుడు, ఈ సంవత్సరం మొదట చదివిన “The Alchemy of Air”, పుస్తకం జ్ఞాపకం వచ్చింది. నోబెల్ బహుమతులు గెలుచుకున్న Fritz Haber (ఫ్రిట్జ్ హాబర్) and Carl Bosch (కార్ల్ బాష్) వారి జీవిత కృషి, గొల్లపూడి గారి మాటల్ని జ్ఞప్తికి తెచ్చాయి.

రాబోయే దుర్భిక్షం నుండి ప్రపంచ జనాభాను కాపాడాలన్నదే ఆ ఉద్దేశం. కానీ వివిధ లక్ష్యాలు ఒకేసారి కలబడితే, తాను కనిపెట్టింది మారణ యంత్రాలకు ప్రాణం పోసింది. రెండవ ప్రపంచ యుద్ధం కనుక చూసివుంటే, ఇంకెంత క్షోభతో చనిపోయుండేవాడో హాబర్.

1900 వరకు అందరు చేసింది ఆర్గానిక్ ఫార్మింగే. రాబోయే 5బిలియన్ జనాభా ఆకలితో చావకూడదంటే, 4 రెట్లు ఉత్పత్తి అవసరం. అది జరగాలంటే, ఉన్న వ్యవసాయ భూమికి ఆ శక్తినిచ్చే ఫెర్టిలిజర్ కనిపెట్టడం అవసరం. 1898లో, సర్ విలియం క్రూక్స్ ముందే పసిగట్టారు. అప్పటివరకు భూసారాన్ని కాపాడటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. జంతువుల ఎరువులతో, పంట మార్పిడితో. ప్రపంచంలో ఉన్న సైంటిస్ట్ లకు, ముఖ్యంగా కెమిస్ట్లకు సందేశం పంపించాడు. ఆర్టిఫిషియల్ నైట్రేట్లు అవసరం.అప్పటివరకు చిలీ, ఇండియా లాంటి దేశాల మీద ఆధారపడిన యూరోపియన్ దేశాలు ఆల్టర్నేట్ సొల్యూషన్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఒకటే మార్గం, గాలిలో ఉన్న 78% నైట్రోజన్ నుండి అమోనియా ఉత్పత్తి చేయాలి. కెమిస్ట్రీ ఎంత రసవత్తరంగా ఉంటుందో, అవసరం మొదలుకొని ఆధిపత్యం కోసం ముగ్గురు జెర్మన్లు పడిన తపన, దాని చుట్టూ అల్లుకున్న ప్రపంచ చరిత్ర అంతే రసవత్తరంగా, భయానకంగా ఉంటుంది. ఆ ముగ్గురు:

  1. Fritz Haber (ఫ్రిట్జ్ హాబర్)
  2. Carl Bosch (కార్ల్ బాష్)
  3. Adolf Hitler (అడాల్ఫ్ హిట్లర్)

బ్రిటిష్ లాగా కాలనీలు లేకపోవడం, చుట్టూ శత్రుదేశాలతో ఉన్న జర్మనీకి ఈ అవసరం పదిరెట్లు. పుట్టుకతో జూఇష్ అయిన హాబర్, రోసిన్యోల్ తో కలిసి అమోనియా చేసే పద్ధతి కనిపెడతాడు. జర్మనీ మీద ఉన్న దేశాభిమానం తో, మతం మీద నమ్మకం లేని తను, క్రైస్తవానికి మారడానికి వెనుకాడడు. శాస్త్రీయ పరిశోధనలో రైట్ బ్రదర్స్ విమానం, ఎడిసన్ బల్బ్ కనిపెట్టిన అంశాలతో పోలుస్తారు హాబర్ పరిశోధనను. వీళ్ళ పేటెంట్ ని, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యతను, బి.ఏ.స్.ఫ్ కంపెనీ కొని, బాష్ చేతిలో పెడుతుంది.

విచిత్రం ఏంటంటే, ఆకలి తీర్చడానికి అవసరపడే అమోనియా నుండి వచ్చే నైట్రేట్, ఆయుధాలకు అంతే అవసరం. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీకి ఇంకా అవసరం. బాష్ రూపొందించిన ఇండస్ట్రీ పరికరాల ద్వారా జర్మనీ రోజుకు 20 టన్నుల అమోనియా ఉత్పత్తి చేస్తుంది. 1918లో హాబర్ కి, 1931లో బాష్ కి నోబెల్ బహుమతులు కూడా లభిస్తాయి. అంత ఉత్పత్తి చేయడానికి తాను కనుగొన్న విధానాలను, బాష్ తర్వాత సింథటిక్ ఆయిల్ ఉత్పత్తికి, ఆటోమొబైల్స్ లో జెర్మనీ మొదటడుగు వేయడానికి కారణం. ఫోర్డ్ లాంటి అమెరికన్ కంపెనీలు కూడా జెర్మనీలో ఉన్న ఇండస్ట్రీస్ చూసి ఆశ్చర్య పోతాయి.

ఇదే క్రమంలో నాజీల నాయకుడు హిట్లర్ జెర్మనీ నాయకుడవుతాడు. జూఇష్ కంపెనీలను మూయిస్తాడు. అంతగా దేశాభిమానం పెంచుకున్న హాబర్, తన మతాన్ని కూడా ఒదులుకున్నా, తన లాబ్ మూసివేయడంతో, పక్క దేశమైన స్విట్జర్లాండ్ కి వెళ్ళినప్పటికీ ఆ ఆవేదనతో మరణిస్తాడు. అంత గొప్ప శాస్త్రవేత్తకు జరిగిన అవమానాన్ని బాష్, ఐన్స్టీన్ సహా అందరూ ఖండించారు. ఆటోమొబైల్ లో, మిలిటరీలో జెర్మనీ అప్పటికే ముందంజలో ఉంచుతుంది బాష్ కనిపెట్టిన టెక్నాలజీ అండ్ స్థాపించిన లెఉన (Leuna) ఫ్యాక్టరీ. హిట్లర్ యుద్ధానికి కాలు దువ్వడానికి, ఇలాంటి టెక్నాలజీ ఉందన్న నమ్మకం.

1940లో హిట్లర్ డెన్మార్క్ అండ్ నార్వేని ఆక్రమించిన తర్వాత, చివరి నిమిషాల్లో మంచంలో ఉన్న బాష్, తన కొడుకుని పిలిచి ఇలా అంటాడు. “మొదట్లో అంతా బాగా జరుగుతుంది. ఫ్రాన్స్ అండ్ బహుశా ఇంగ్లాండ్ కూడా ఆక్రమించబడతాయి. కానీ రష్యాని కదిలించి అపాయాన్ని కొని తెచ్చుకుంటాడు. అది కూడా కొన్నాళ్ళే. ఆ తర్వాత నల్లని మేఘాలు, ఆకాశం నిండా యుద్ధ విమానాలు, మొత్తం జెర్మనీ ధ్వంసమై పోతుంది, నేను కనిపెట్టిన ఫ్యాక్టరీ తో సహా.” 1940, ఏప్రిల్ 26 తేదీన బాష్ మరణించాడు.

“A total of 6,552 bomber sorties over 20 US Eighth Air Force and 2 RAF attacks dropped 18,328 tons of bombs on Leuna. As the most heavily defended industrial target in Europe, Leuna would become so dark from flak, German smoke pots, and exploding oil tanks that “we had no idea how close our bombs came to the target.”. On clear days, only 29% of the bombs aimed at Leuna landed inside the plant gates” – Wikipedia.

1961లో చైనాలో వచ్చిన కరువులో 3కోట్ల మంది మరణించారు. 1972లో, అమెరికా ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ తో కలిసి 13 అమోనియా ప్లాంట్స్ ఏర్పాటు చేసింది. 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు చైనా, కరువు గురించి కాదు, అతిస్థూలతతో వచ్చే ఇబ్బందుల్ని ఎదుర్కుంటోంది.


Posted

in

,
COMMENTS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *