
“ధనాశే మా జీవితాల పై విసిరిన అణ్వస్త్రం.”
“The world cannot be understood with numbers. And it cannot be understood with numbers alone.” — Factfulness, Hans rosling.
పొత్తూరి విజయలక్ష్మి గారు “కృష్ణమూర్తి తాతయ్య” కథలో అంటారు: “ఇప్పుడు తినేది అన్నమే గా, ఎం మారింది?” అని, విదేశాల నుంచి తిరిగిరాని తన కొడుకు మీద కోపంతో, మారుతున్న కాలానికి కోల్పోతున్న సంబంధాలకు చిహ్నంగా. ప్రశ్నలు సంధించే పాత్రలు సృష్టించడం అంత సులువు కాదు. గొప్ప రచయిత్రి ఆవిడ.
నిజ జీవితంలో అలాంటి వందలాది మంది ఆలోచనలు, అగాధం లో నుండి తీసి, పరిచయం చెయ్యడం, అది అలాంటిదేశంలో. ఎంత శ్రమ పడుండాలి? చదివిన రెండు పుస్తకాలలో ఆవిడ వినిపించింది వారి స్వరాలే. స్విట్లానా అలెక్సివిచ్(Svetlana Alexievich), రష్యన్ జర్నలిస్ట్.
కమ్యూనిజమ్ ప్రజ్వలిల్లుతుందనే నినాదమే కాదు, అసలు మీరు తీసుకొచ్చిన క్యాపిటలిజం సిద్దాంతానికి ఆధారం ఏది ? వాళ్ళ జీవితాలు ప్రశ్నిస్తున్నాయి, ఇలా:
“జర్మన్ల అరాచకం గురించి ఎంతని రాయగలరూ ? యుద్ధం గురించి తెలుసుకోవడం వేరు, యుద్ధంలో జీవించడం వేరు.”
అడవి పైనుండి చూస్తే నిర్మానుష్యంగా ఉంటుంది. లోపలికి, లోతుకు వెళ్లినట్లైతే అన్ని రకాల శబ్దాలు వినబడతాయి. కన్సుమెరిజంలో ఉంటూ వాళ్ళ కమ్యునిజం గురించి తెలుసుకోవడం కష్టమే. స్టాటిస్టిక్స్తో కళ్లు కప్పేశారు. కదిలిస్తే ఆ ఆవేదన అర్థమవుతుంది.
“యుద్ధ సన్నాహంలోనో, లేక పోరాటంలోనో. మాకు తెలిసిన జీవితం అంతే. బానిసత్వాన్ని ఇష్టపడిన గుండెలు మావి.”
“పాల సముద్రపు అలల ఒడ్డున ఉన్న రాజ్యంలో జీవించాలని ఉంది. కానీ ఆ ఊహల్ని, భావోద్రేకాన్ని, కబళించేశారు”.
“అంతులేని కారుణ్యం ఆ ఆడవారిలో. మితిమీరిన ఐశ్వర్యాన్ని తట్టుకోలేరు. అటువంటి వారిని కొనలేరు. ఈ కాలంలో డబ్బేప్రపంచం. వాత్సల్యానికి చోటేది. ధనాశే మా జీవితాల పై విసిరిన అన్వస్త్రం.”
“పార్లమెంట్ మొత్తం దుర్మార్గులతో నిండి ఉంది. కర్కశ హృదయులైన ధనవంతులతో. ఖైదీలు వాళ్ళు. నాయకులు కారు.”
“సోవియట్ రోజుల్లో ఎన్ని పుస్తకాలైన కొనగలిగే వాళ్ళం. ఖరీదైన ఇల్లు, కారు అక్కర్లేదు. సాధారణమైన వేషధారణ నేర్పేవారు. ఉదయాన్నే కాసింత పెరుగు, పాలు. చాలదా ? డబ్బు గురించి మాట్లాడితే అవమానకరం. అత్యాశకు ఆస్కారంలేని రోజులవి.”
“ఈ రోజుల్లో ‘ ఏమి చదువుతున్నావు‘ అని అడగడం నేరంగా మారింది.”
“70 సంవత్సరాలు నూరి పోశారు. జీవితంలో స్వేచ్ఛ ఉచితమని. ప్రేమ, ఆప్యాయత కోసం పోరాటం. ఎప్పుడైతే‘అమ్మండి, సంపాదించండి, అనుభవించండి‘ అని మొదలైందో.. అంతా డబ్బు మయం. పుస్తకాల గురించిమర్చిపోయారు.”
“ప్రస్తుతం టీవీలో యాడ్ వస్తోంది. ఒక బాత్ టబ్ యొక్క ఖరీదు, చిన్న అపారట్మెంట్ అంత. అర్థం కాకఅడుగుతున్నాను, అలాంటివి సంపాదించడానికేనా బతికుండేది ? అదేనా స్వేచ్ఛ అంటే? జాలేస్తోంది నా మనవరాలినిచూస్తుంటే.”
“ప్రతి ఒక్కరి స్వభావం కాదు, పక్క వాడి ఆకలిని తెలివిగా అపహరించడం. ఆ ఆలోచనలే అప్రియం కొందరికి.”
“నిన్న రాత్రేగా అఖ్మతోవా (Akhmatova) పుస్తకాల కోసం లైబ్రరీ బయట నిలబడ్డావు. అంతలోపే ఓర్పుని కొలిపోయావా ? నిజంగా ఆనందాన్ని ఇస్తుందా ఆ జర్మన్ గ్రైండర్?”
ఇమేజ్ credits: గూగుల్.
Leave a Reply