అమరావతి కథలు, సత్యం శంకరమంచి

3,4 పేజీలేగా, కొన్ని కథలు చదివి పడుకుందాం.. మనస్సు ఇంకాస్త తెలిక పడుతుందేమో.

కొన్సేపు ఆయన్ని పలకరిద్దామని, ఎనిమిదింటికి మొదలుపెదితే, అలా కృష్ణమ్మ ఒడ్డుకు తేసుకెళ్ళి, స్నానమాడించారు.

క్లుప్తంగా చక్కనైన పాత్రలతో, ఆనాటి అందాలను శిల్పంగా చెక్కి, ఎన్నో కథలు వినిపించారు.

శిఖరం కట్టినా ఫలితం ఆశించని నిర్మలమైన సత్తయ్య మనసున్ని, ఆరోజుకి పాఠం చెప్పకపొతే నిద్రపట్టని సుబ్బయ్య మాష్టారు ప్రేమను, అందరి భోజనాన్నీ తానే చేస్తున్నట్టు మురిసిపొయే పూర్ణయ్య పెదవులపై చిరునవ్వుని, ఇంకా ఇలా ఎన్నో… గుండెకు హత్తుకునే అనుభూతుల్ని కథలుగా మార్చి, అమరావతి కథలతో ఆ అమరేశ్వరుడికి అభిషేకం చేశారు.

ఎన్నో కన్నీళ్ళని, నవ్వుల్ని తీసుకొచ్చాడయ్య… కొన్ని కథలు చదువుతుంటే, కళ్ళలో కృష్ణ పొంగుతోందయ్యా. అమ్మా, అయ్యే కాదు, ఆ కృష్ణమ్మ కూడా విన్నటుంది. తెలుగు వారికి దొరికిన ఆణిముత్యం, మహాప్రసాదం.

హర హర మహాదేవా.. నర హర మహాదేవా..!!

“ఆకారాల గురించి ఆకాశమంత వర్ణనలు చేశారుగాని, మనస్సులోని అగాధ పాతళం నుండి అమూల్య రత్నాలు వెతికి తీయ్యరేమి?”


Posted

in

,
COMMENTS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *