నవల సాహిత్యానికి, సాంప్రదాయ వర్ణనకి, జీవనశైలి పరిచయం చెయ్యడానికి “వేయిపడగలు”ది అగ్రస్థానం కావచ్చు. కానీ, 90 ఏళ్ళ తర్వాత రాబోయే పరిణామలను 1935 లో పరిచయం చేసిన ఆనకట్ట, “చెలియలికట్ట”.
నేను ఆ టైంలో పుట్టలేదు, నాకు అప్పట్ట్లో జరిగిన సైలంట్ వార్స్ గురించి తెలీదు. విన్నాను. “మైదానం” చదివాను. నచ్చలేదు. “చెలియలికట్ట” చదివాను. నచ్చింది. కాదు, కాదు, జీవితాన్ని మార్చేంత ప్రభావితం చేసింది. శతాబ్దం కిందటి మాట, నాకు తెలీదు కాని, 2020 నేను చూస్తున్న మార్పులకు, వ్యతిరేకంగా నిలబడి, చదివిన వారి మీద లోతుగా ఒకరి మీద ముద్రవేయగల శక్తి కొన్నింటికే.
కొన్ని పుస్తకాలు ఎప్పుడు చదవాలి అనుకుంటే, అప్పుదు చదవలేము. నువ్వు ఎంత ప్రయత్నించినా దగ్గరకు తీసుకోవు. కొన్ని నీ జాతకం బాగుంటే జీవితం మలుపు తిప్పడానికి ఒచ్చి నీ మీద వాల్తాయి. అంతే. మారుస్తాయి. ఒకసారి చదివి మర్చిపోయేవా? మూడొచ్చినప్పుడు నేమరెస్కోవడానికి టైంపాస్ నవలా? అచరణలో పెట్టకపోతే, ద్రోహం చేసినట్టుకాదు? నాలో మిగిలిపోయిన కొన్ని:
‘తల్లీ ! నీకు తెలియదు. నీవు శరీరాన్ని చూస్తున్నావు, ఆత్మని చూడు, మనస్సు చూడు. ప్రేమని చూడకు, ధర్మాన్ని చూడు. సుఖాన్ని చూడకు, సంప్రదాయాన్ని చూడు. బయట చూడకు తల్లీ, లోపల చూడు! నిన్నూ, నీ భర్తనూ చూచుకోవద్దు, నీ కొడుకును చూచుకో! సంతానాన్ని చూచుకో. నెత్తురు చెడిపోకుండా చూచుకో! అదే వర్ణం. దానిలో గుణాలు ఉంటవి. గుణాలలో కల్తీవస్తే వర్ణం పోతుంది. ధర్మం నశిస్తుంది. సుఖాలకేమి, ఉద్యోగాలకేమి, ధనాలకేమి?’ – రత్నావళి
మనసులో కలవరము వున్నది
కడలిలో కలవరము వున్నది
మనసు లోకపుహద్దులో విరుగున్
కడలి చెలియలికట్టలో విరుగున్
మనసులో కలవరము హెచ్చిన
కడలిలో కలవరము పొంగినా
మనసు లోకపుకట్ట తెగిపోవున్
కడలి చెలియలికట్ట తెగివచ్చున్
మనసు లోకపుకట్ట తెగితే
కడలి చెలియలికట్ట తెగితే
మనసు చచ్చిన ప్రేతకళ లీనున్
కడలి భైరవు కాలిమువ్వ లగున్
— చెలియలికట్ట, 1935, విశ్వనాథ
Leave a Reply