‘ఆత్మేశైలి’ – చలం మ్యూసింగ్స్

ఆ పుస్తకం పేరు తలిస్తే చాలు, మనసు ఆ పేజీల నడుమకి వెలిపోతుంది. ఇంకా ఎం దొరుకుంతుందనో. 18 ఏళ్ళు పాటు ఆ ఆవేదనని ప్రచురించారు. 2 శీతాకాలలు సరిపోతాయా ? ఆ విధంగా ఎవరన్నా ప్రశ్నించగలరా ? మైదానం చదివి ఈ రచయితకి నాకు సరిపడదు అని అనుకున్నానే. కాని మళ్ళీ ఇంకో చాన్స్ ఇవ్వు, “మ్యూసింగ్స్”తో, అన్నాడు నాన్న. అసలు అది, ఇది రాసింది ఈయనేనా ? మూడు చాప్టర్లు చదివితేనే ఇంత లోతుగా ఉందే. మరి మొత్తం పుస్తకమో?

“తాము తక్కిన మనుషులకంటే ఉన్నతులమని నిరంతరము మోస పోవడానికి వీలయ్యే రంగుల ఇంద్రజాల వస్త్రాలని కప్పాడు లోకం మీద దేవుడు.”

ఆ వచనంలో ఉండే గంభీరత్వాన్ని కొలవగలిగి వివరించగల శక్తి నాకు లేదనుకుంటాను. ఏదో ఆ ఆవేదనని అర్థంచేసుకుందామనే ప్రయాస అంతే. కానీ ప్రతి సంవత్సరం ఒక్కసారన్నా తిరిగి, ఆ పుస్తకంలో చాల చెప్పారు, మర్చిపోయేనే, కాస్త గుండే నిబ్బరం తగ్గించుకుందాం అని అనుకుంటూ ఎన్నిసార్లు తిరగేశానో.

కొందరు రచయితలు పుస్తకం మూసేసిన తర్వాత, ఒక చిన్న జ్యోతి ఇచ్చి పంపుతారు. అది పట్టుకొని ఏదో సాధించానని, ఇంకా సాధించాలని, తెలుసుకున్నానని, ఇంకా తెలుసుకోవాలని, విడుపులేని చక్రంలో కొట్టుకోకుండా ప్రశ్నించే తీరుని అలవర్చుకుంటాము. ఆ ప్రయాణంలో నీలో ఉండే అహాన్ని అనచి, సరళతను నింపుతుంది. ఆ మార్పు నిన్ను నీకు పరిచయం చేస్తుంది. పైనుండే చెత్తని చూసి తెలుసుకున్నామనే బ్రమలో పడకుండా, స్ప్రింగ్స్ ఆఫ్ జాయ్ అండ్ ఫేయిరీ టేల్స్ని వెతకడానికి ఉపబలాన్నిస్తుంది. చాల అరుదు. అలాంటి జ్యోతులు దొరకడం. ఉదయాన్నే లేచి పరిగెట్టాలన్న డిసిప్లైన్ కి, సాంగ్స్ పక్కన పెట్టి, నిశ్శబ్దాన్ని వినటం అలవాటు చేసిన ఇద్దర్లో ఒకరు, చలం.


Chalam — Romain Rolland

“Write it as simple as its unfolding. Waste no thought upon the word and the letter, and the subtle vain researches in what the force of artists today is turned to nought. You are addressing all men; use the language of all men. There are no words, noble or vulgar, there is no style chaste or impure; there are only words and styles which say exactly what they have to say. Be sound and thorough in all you do; think just what you think – and tell just what you feel. Let the rhythm of your heart prevail in your writings. The style is the soul”.

– Romain Rolland

“చాలా సులభంగా ‘సింపుల్’గా, ఎట్లా వెలువడితే అట్లా ‘సింపుల్’ గా రాయి. మాట మీద మనసుని వ్రుధా చేసుకోకు. అక్షరం పైన ఆలోచనను నిలపకు. ఈనాటి కవుల శక్తి నాజూకైన శబ్దాల, అర్థంలేని మెలికల్లో, వెతుకుళ్ళలో, మెరుగుల్లో ఇంకిపొతోంది. ప్రజలందరు చదవడానికి రాస్తున్నావు. ప్రజలందరు మాట్లాడే భాషని రాయి. గొప్ప మాటలని, నీచపు మాటలనీ, నిర్దుష్టమైన శైలి అనీ, ఇవే ఉన్నాయి. చెప్పేది సంపూర్ణంగా, తెలిసేట్టు చెప్పేయి. ఏది ఆలోచిస్తున్నావో, అది సరిగా, నిజంగా ఆలోచించు. నిజంగా దేన్ని అనుభవించావో, అది చెప్పు. నీ హ్రుదయంలోని లయ నీ రాతల్లో కనపడనీ. ఆత్మేశైలి.

– చలం (Chalam).


Posted

in

,
COMMENTS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *