
పర్వతశ్రేణి లక్షణము విశిష్ఠమైనది. వాటి మీద ఆధారపడిన జాతి సాంప్రదాయములను, ఆలోచనలను, జీవన శైలిని రూపుమార్చును. అంతేకాక ఆ జాతికి రక్షణకవచం లాగ ఉండును. అనేక విధములుగా ఆ జాతి యెదుగుదలకు కారణమగును. అటువంటి పర్వతశ్రేణిని రక్షించుకొనుట వారి భాధ్యత.
అలా ఏర్పడిన జాతికి, వారి సంప్రదాయములు, భాష, నమ్మిన ధర్మము, సంస్కృతి, కాలక్రమేనా రూపుమారును. అయినా ఆ జాతి యొక్క మూలాలు, ఆలోచనా విధములు, సాంప్రదాయము యొక్క విశిష్టత, ధర్మము యొక్క గొప్పతనము, ముందు తరాలవారికి అందించగల శక్తి కేవలము అందులోని కావ్యాలకు, పురాణాలకు, మహాగ్రంథాలకు మటుకే కలదు. జీవితకాలములో ఎన్ని పురాణాలు విన్నను, వాటిలోని లోతుని తెలిపే రచనలు కొన్నే ఉండును. మరికొన్ని విధములు ఉండవచ్చునుగాని, గ్రంథాలదే అగ్రస్తాయి. ఆట్టివాటిల్లో కూడా కేవలం కొన్ని మాత్రమే, నీ అలోచనా విధానాన్ని రూపుదిద్ది సరియైన మార్గములో పెట్టగలిగినవి, ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకు, మూలాలు వెతికే సమయములో సమాధానం ఇవ్వగలిగినవి. నడిపింపదగినవి. ఆధారం.
వివిధ భాషా సంస్క్రుతులతో కలిసి జీవించు రోజులలో కూడా ఆ భాష యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, సంప్రదాయన్ని నిలబేట్టే గ్రంథాలు, రచనలు చేసిన ఘనత కొందరిదే. అట్టి పండితులలో కూడా, కొందరి రచనలే, మహాపర్వతశ్రేణిగా గుర్తించదగినవి. నిధి. రక్షణ కవచం. ఆ జాతిలో అందరికీ తెలియకపోయినను, భాషను, సాంప్రదాయాన్ని, ధర్మాన్ని పర్వతశ్రేణి లాగా రక్షిస్తున్నవి అవే. వాటిని కాపడటం ఆ జాతి యొక్క ధర్మము. బాధ్యత.
ఆయన రచనలు నాకు భగవథ్గీత వంటివి. ఆయనకు శివుడే రాముడు. నాకుమటుకు ఆయనే శివుడు. పరమేశ్వరరూపము. దైవం.
చదివిన పుస్తకాలలో కొన్ని:
“కోపము ప్రణయమైన గుణము. దానియందు సర్వభావములు లీనములగును. ప్రేమ, దు:ఖము, జాలి, యాశ్చర్యము, పట్టుదల, ఈ ప్రధానములైన మనోభావములు కూడా, కోపమునందు లీనమైపోవును…” – మ్రోయుతుమ్మెద.
“తల్లీ! నీకు తెలియదు. నీవు శరీరాన్ని చూస్తున్నావు, ఆత్మను చూడు. మనసును చూడు. ప్రేమను చూడకు. ధర్మాన్ని చూడు. సుఖాన్ని చూడకు, సాంప్రదాయన్ని చూడు. బయటకు చూడకు తల్లి, లోపల చూడు. నిన్నూ, నీ భర్తను మాత్రమే చూచుకోవద్దు, నీ కొడుకుని చూచుకో! సంతానన్ని చూచుకో. నెత్తురు చెడిపొకుండా చూచుకో. అదే వర్ణం. దానిలో గుణాలుంటవి. గుణాలలో కల్తీవస్తే వర్ణం చెడిపోతుంది. ధర్మం నసిస్తుంది. సుఖాలకేమి, ఉద్యోగాలకేమి, ధనాలకేమి?” – రత్నావళి, చెలియలికట్ట.
“మానవుని యొక్క ప్రవర్తతను, శీలమును, నీతిని సద్గునములను పాలించని చదువు, చదువా? సత్పురుషుడు చదివెడి శాస్త్రములు వేరు. ఉద్యోగములకు కొరకు చదివెడి లౌకికపు చదువు వేరు. లౌకికపుచదువెంత చదివినను ధనాశ అభివృద్ధి పొందును. అధికారాశ వ్రుద్ధి పొందును. మానసి బుద్ధి సరస ద్వివేకము పొందబోదు.” – సముద్రపుదిబ్బ.
Leave a Reply