“మ్రోయుతుమ్మెద” లో ఇస్లాం – విశ్లేషణ – అభిప్రాయం


Halley Kalyan‘s full article: విశ్వనాథ “మ్రోయుతుమ్మెద” లో ఇస్లాం

టైమ్ తీసుకొని చదవండి. ఈ మధ్య ఎప్పుడూ అంత మంచి పెద్ద వ్యాసం చదివి ఉండరు. నేను ఏకబిగిన చదివి, ఏకబిగిగా రాసిన అభిప్రాయం ఇక్కడ:

ఒక వ్యాసం అప్పుడే ముగిసిందేంటి అన్న భావన కలిగింది. ఇది కేవలం విశ్వనాథ వారు ఇస్లాం రాజ్యాన్ని సపోర్ట్ చేయలేదని, ఉమ్మడి సంస్కృతి కి ఏమి నాంది పలకట్లేదు అని చెప్పడమే ఉద్దేశం కాదు. మన సంప్రదాయం మన అలవాట్లు మన సంస్కృతికి విలువ ఇవ్వలేదు, ఇంకొక మతాన్నో, సంస్కృతినో  పొగుడుతూ, జరిగే ప్రతి మార్పుకు తలుపుతూ, మనది అంటూ ఒకటి ఉంది అని అనే విషయాన్ని మరిచిపోతున్నాము అని గుర్తు చేయడం కూడా. 

వ్యాసానికి వస్తే, కేవలం వారి రచనల్లో ఒక చోట ఒక మతం వారు మన ఆలయాన్ని పడగొట్టారో, లేక మనమే పడగొట్టి వాళ్ళ మీద వేస్తున్నామని అన్న మాత్రాన, ఆ మతాన్ని వెనకేసుకుని వచ్చి నేర్చుకోండి అన్నట్టు కాదు. అయినా అలా వారి సాహితీ మిత్రులకు ఎందుకు అనిపించిందో తెలీదు. విశ్వనాథ వారి వివిధ రచనలు చదివాను కనుక, ముఖ్యంగా “మ్రోయుతుమ్మెద” చదివాను కనుక రెస్ట్ అఫ్ ది బుక్ మిస్ అయ్యుంటారు అనుకున్నాను. ఎందుకంటే హేలీ గారు quotes తో సహా రాసినట్టు చాలా చోట్ల స్వ పర భేదాలు గురించి వివరిస్తూ వస్తారు. వివిధ పాత్రల ఆలోచనల/సంభాషణలలో, వారి శైలిలో. 

విశ్వనాథ వారు సంప్రదాయవాది  కాబట్టి, వారు ముస్లిం మతం గురించి మంచిగా రాసిన అక్కడక్కడ, అబ్బే అలా ఆయన రాయడు, లేకపోతే చూడు వాళ్ళు మనవాళ్ళు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్న ఆలోచనలు దొర్లడం విచిత్రమేమి కాదు, సహజం. ఈ పుస్తకంలో ఒక చోట, అక్బర్ తాన్సేన్ ల గురించి విశ్వనాథ వారు ఇలా అంటారు, తాన్సేన్ సంగీతం గొప్పతనాన్ని గుర్తుచేస్తూ: 

“””[గు] ఒక విద్య నీకు రావలయుననగా దాని మీద పుట్టెడభిమానము పెరగవలయును. ఆ యభిమానం లేకుండా నావిద్యయందు మమకారము కలగదు. అది రాదు. తాన్సేను సదారంగ్, హరిదాస్ మొదలైన వారు మహానుభావులు. హిందుస్థానీ సంగీతంలో తాన్సేను ఎన్నో రాగములు కనిపెట్టెను. సంగీత సారము, రాగమాల, సూర సాగర మన్న గ్రంథములు కూడా రచించను. ఆ తాన్సేను అవతారపురుషుడు. అక్బర్ సభలో అబ్దుల్ రహీం అని ఒక గొప్ప కవి కలడు. అతడు తాన్సేను ను గురించి ఇలా వ్రాసెను…

“ఆది శేషునకు చెవులు లేవు. భగవంతుడు చెవు లీయలేదు. అతడికి చెవులుండినచో అతడు తాన్సేను సంగీతము వినియుండెడి వాడు.తల కదల్చెదివాడు. భూమియు, సుమేరు పర్వతము క్రింద పడిపోయెడివి.”

[శి] అబ్దుల్ రహీం ముసల్మాను కదా ! అతడి కల్పన మన పురాణాలను నాశ్రయుంచి యున్నదేమి ?

[గు] ఇచటి ప్రశ్న ఆ కథ ఏ జాతిలో ఉన్నదని కాదు. అది కవిత్వమునకు ఎంత ఉపయోగ పడుచున్నది ? అది నిజమా అబద్దమానన్నది కాదు. తాన్సేను యొక్క సంగీతమటువంటిదని చెప్పుట. అతడి సంగీతము యొక్క గొప్పదనము ఇంకెట్టు చెప్పవలయును ? తాన్సేను యొక్క సంగీతము విని సిరఃకంపరము చేయలేనివా డుండడని యర్థము. మొద్దయినను,రాయైనను కదలక యుండలేదని యర్థము. అట్టి మథురమైన సంగీత ధ్వని స్రుష్టికి మూల స్తంభము వంటిదని అర్థము. ఆ సంగీతమొక మహాయగ్నం వంటిది. ఒక మహాక్రతువు చేసినప్పుడు తచ్ఛక్తి చేత స్రుష్టిలోనున్న భూతముల యందలి దోషము పోవును. యెగుడు దిగుడులు సర్దుకొనును. సంగీత విద్య కూడా నటువంటిది. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి. ఆది శేషువు ఫణి. ఆయన తల ఆడించవలయును. ఆయనకువినుడు శక్తి లేదా ? ఉన్నది. వినలేదా ? విన్నాడు. కాని భూమిని చలించకుండా పట్టుకున్నాడు. చెలించుచునె పట్టుకున్నాడు . ఆ చలనము మనకు తెలియుటలేదు. ఇదే శాంతారసము. ద్రుపదగాయకి లక్షణము. ఈ శాంతారసము తాన్సేను యొక్క సంగీతమందలి నిండి యుండును. అబ్దుల్ రహీం యొక్క పద్యములో ఇంత అర్థమున్నది.”””

ఎంత గొప్ప వివరణ. ఇదే విషయం నేను ఒక మిత్రుడితో అంటే, అంటే ఇకమీదట కర్ణాటక సంగీతం వదిలేసి రేపటినుండి హిందుస్తానీ పాటలే వింటావా ఏంటి ? అని అన్నాడు. ఎందుకు అలా అనిపించింది అంటే, ఆయన గురువు కదా ఇంకా ఫాలో అవ్వాలిగా అన్నాడు. ఆ తర్వాత నవల గురించి వివరించాను గానీ, అసలు ఇలా ఒక కవి or సంగీత విద్వాంసుడి గొప్పతనం చెప్తే మన సంస్కృతికి ద్రోహం చేసినట్లు కాదు, అలాగని వాళ్ళు చేసేవి అన్ని మీరు చేయాలి, అందరం కలిసుండాలి ఎవరు ప్రభువైన అని ఆ రచయిత ఉద్దేశం కాదు. ఇక్కడ తాన్సేను సంగీతం గొప్పతనం వరకు వివరణ కానీ మన సంగీతం లో ఇలాంటి వారు లేదని కాదు అర్థం. అదే విధంగా ముస్లింల పాలన యొక్క గొప్పతనం, మన రాజులు వాళ్ళ కింద బతకాలి, మనం కూడా అందరం మన చదువులు మానేసి, వాళ్ళ education or culture నేర్చుకోవాలి అని కాదు. మిగిలిన పుస్తకంలో పెట్టాల్సిన చివాట్లు పెట్టారు. అది వదిలేసి ఇలా ఒక పేరాగ్రాఫ్ or ఒకే సందర్భంతో మొత్తం రచయితను judge చేస్తే అది మన దృష్టి లోపమే. ఇంకొకరు వచ్చి విశ్వనాథ వారి గొప్పతనాన్ని వేరే ముద్ర అతికించి (సెక్కులరిజం or ఉమ్మడి సంస్కృతి, ఇక్కడ కాంటెక్స్ట్ లో) , రేపటి నుంచి మీరు కూడా మీ సనాతన ధర్మం వదిలేసి, మా సంప్రదాయం ఫాలో అవ్వండి అనే స్థితికి వస్తుంది. లేదా ఎవరి కల్చర్ వారికి అర్థం కాక, అందరం మనుషులమే, ఎలా ఉన్నా పర్లేదు, మన డబ్బులు మనం సంపాదించుకుంటూ జీవితం గడిపేద్దాం మన నియమాలను వదులుకుంటూ స్వేచ్ఛా ప్రపంచంలో విహరిద్దాం అనే సంఖ్య ఎక్కువవుతోంది. ఎక్కువయ్యింది. అటువంటి వారికోసం కూడా, ఈ పుస్తకంలో వర్ణ నియమాలని గుర్తు చేస్తారు. (ఏ రచనలో చెయ్యరు?). 

వ్యాసకర్త సాహితీ మిత్రులు, అన్న విషయం: “మన లోపాల వల్ల మన సంస్కృతికి ముప్పు అని” లో చాలా నిజం ఉంది. మన పురాణాలు, గ్రంథాలు అర్థం చేసుకోవడంలో గురువులను ఉపగమించ కుండా, సొంత ప్రయత్నాలు చేస్తే, మన సంస్కృతి ధర్మం అన్నీ తప్పుగా అర్థం చేసుకొని, ఒక ధర్మ విరుద్ధ పని జరిగిన, దాన్ని ఎదురించి మాట్లాడే శక్తి కోల్పోతాం. లొంగిపోతాం. ప్రతి మార్పు, అందరూ మనుషులే, అందరూ సమానమే అన్న లిబరల్ ఐడియాస్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసిన వాళ్లమవుతాం. ఎన్ని పూజలు, పునస్కారాలు చేసినా. 

శబరిమల కేసు గురించి మా ఫ్రెండ్ సర్కిల్ (30-32 గుంపు) లో ఒకసారి డిస్కషన్ వచిన్నపుడు, అసలు ఒక గుడి, తర తరాల సంప్రదాయం అని వదిలేసి, అందరూ వెళ్తే తప్పేంటి అని వాదించాడు నా స్నేహితుడు. తిరుమలలో కూడా వైష్ణవులే ఎందుకు పూజలు చేయాలి, వేరే కులం వారు ఉంటే తప్పేంటి అని వాదించాడు. భగవద్గీత లో అదే చెప్పారు, ఎవరైనా వేదం చదవచ్చు అని.  ఇది, ఒక గురువు దగ్గరకు వెళ్లకుండా, అన్నీ తెలుసు అనుకోని, సొంతంగా పురుషసూక్తం నేర్చుకొని, రోజూ చదువుతానని, మన ధర్మాన్ని గురించి నా స్నేహితుడి వాదన. నేను అమెరికా లో ఉండే దగ్గర క్రైస్తవుల సంఖ్య ఎక్కువ. కుటుంబ విలువలు కూడా. ప్రతి ఆదివారం చర్చికి వెళ్లే అలవాటు. ప్రార్ధన. ఇది వాళ్ళ ఆచారం. మాటల్లో వారి గురించి చెప్తుంటే, ఇంకో స్నేహితుడు, చూడు ఎంత డిసిప్లిన్ గా ప్రేయర్ చేస్తారో, ఆలా ఉండాలి. మన ఆలయాలు గోలగా ఉంటాయి, అందుకే ఇంట్లో దణ్ణం పెట్టుకుంటాను, గుడికి వెళ్ళను, టైం వేస్ట్… వగైరా ఇలా చెప్పుకొచ్చాడు. ఒకరి కల్చర్ పొగడడానికి మన సంస్కుతిని కించపరచనవసరం లేదు. వారి ప్రార్ధనకి మన పూజలకు ఉన్న తేడా గమనించినా చాలు. చాలదు. కేవలం డబ్బులు సంపాదించి పెట్టే చదువులని తప్ప, కోర్స్ సిలబస్ లో లేదు కనుక, ఇలాంటి విషయాలతో మాకు సంబంధం లేదు, ఒకవేళ విన్నా అన్ని సొంత తెలివితేటలు వాడి వాదిస్తాము అనే లాగా మన చుట్టూ ఉండేవారు పెరిగిపోతున్నారు. ఆలా అవ్వకూడదు అంటే, మన చరిత్ర తెలియాలి, మన ధర్మం అర్థం కావాలి. దేనికైతే మన పూర్వికులు కృషి చేశారో, దాన్ని నిలబెట్టాలి. చదవాలి, తెలుసుకోవాలి. కృషి చేయాలి. రాబోయే తరంలో ఒక్కరు మిగిలిన విజయమే. 

చివరి మాట, ఈ వ్యాసంలో ఒక దగ్గెర అన్నారు : వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కాకుండా ధర్మ రక్షణ పునర్జీవనం కోసం చేసే ప్రయత్నాల వలెనే హిందూ సంస్కృతి ఈ మాత్రం మిగిలి ఉందని. ఈ వ్యాసం, వ్యాసకర్త కూడా ఆ కోవకే. నా దృష్టిలో. 

– విశ్వనాథ అశోక్ వర్థన్ 



Posted

in

COMMENTS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *